సీజనల్ హాస్టల్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించండి..
సీజనల్ హాస్టల్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలో సీజనల్ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. హాస్టల్ లోని ప్రతి గదిని తనిఖీ చేసి, విద్యార్థులతో ప్రభుత్వం అందిస్తున్న వసతుల గూర్చి సబ్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు కు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల హాజరు పట్టిక ప్రకారం విద్యార్థులు వసతి గృహం లో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో సబ్ కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.