V POWER NEWS : మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ నెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రజలకు యోగ పై అవగాహన కలిపించేందుకు కర్నూలు రూరల్ మండలం పంచాలింగాల గ్రామంలోని తన స్వగృహం లో ఆయన యోగాసానాలు చేసారు. యోగా చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందని, యోగా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని ఎం.పి నాగరాజు తెలిపారు.