కోసిగి పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక బార్డర్లో స్టేషన్ కు దగ్గర ఉండటంతో అక్రమంగా కర్ణాటక మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక దుకాణదారుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పాత రికార్డులను తనిఖీ చేయడం జరిగిందన్నారు.
రాబోయే రేణుక ఎల్లమాంబ జాతరను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మండలంలోని శాంతి భద్రతలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డి.ఎస్.పి ఉపేంద్ర బాబు,సి.ఐ మంజునాథ్,ఎస్సై చంద్రమోహన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు