భక్తులకు సౌకర్యాలతో వసతులను కూడిన ఏర్పాట్లను చేయండి .. నంద్యాల జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రుల బృందం ఆదేశాలు ..


11 రోజుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు పాలు,మంచినీరు,బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్లో ఉన్న మహిళల పట్ల ప్రత్యేక దృష్టి చేపట్టాలని మంత్రుల బృందం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.మహాశివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26,27 నాలుగు రోజులలో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసు అధికారులకు ఇచ్చేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందని,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు.అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుక అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.40 కి.మీ మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు,బిస్కెట్లు తదితర వాటిని ఇతర చేసేలా ఏర్పాటు చేసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అటవీ చెక్‌పోస్టులను, దేవదాయశాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ,పోలీస్, దేవదాయ శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, ప్రముఖుల దర్శనాలకు టైంస్లాట్ ఏర్పాటు చేయాలన్నారు.ఎంఎల్ఏ సూచనలు ఆహ్వానించదగినవని అన్నారు.ఈ సమావేశానికి ముందు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విపులంగా వివరించారు.సోమవారం ఉదయం దేవదాయశాఖ కమీషనర్, రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్‌లు భక్తుల క్యూలైన్లు, పాగాలంకరణ ఏర్పాట్లు, కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు